Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయ్ లక్ష్మిని సర్ ప్రైజ్ చేసిన చిరంజీవి.. ఆల్ ది బెస్ట్ చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన మెగాస్టార్

  • రేపు విడుదలవుతున్న 'జూలీ 2'
  • ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుతూ, ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరు
  • ఉబ్బితబ్బిబ్బు అయిన రాయ్ లక్ష్మి
హీరోయిన్ రాయ్ లక్ష్మికి మెగాస్టార్ చిరంజీవి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ లో ఆమె నటించిన 'జూలీ 2' సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియోను పంపారు చిరు. బాలీవుడ్ లో తొలి సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇది నీకు ప్రత్యేకమైన సినిమా అని... ఎందుకంటే ఇది నీ కెరీర్ లో 50వ సినిమా అని చెప్పారు. వివిధ భాషల్లో నటిస్తూ, అభిమానులను మెప్పిస్తున్న నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నానని అన్నారు. నీ టాలెంట్ ను, నీలో ఉన్న సత్తాను 'జూలీ 2' చూపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. "వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్... గుడ్ లక్ టు 'జూలీ 2'" అంటూ చివర్లో ఫ్లయింగ్ కిస్ విసిరారు.

ఈ వీడియోను చూసి రాయ్ లక్ష్మి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. "ఓ మై గాడ్. మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం నిజంగా ఒక ఆశీర్వచనంలాంటిది. నా జీవితంలో ఇది ఒక గొప్ప బహుమతి. థ్యాంక్యూ సో మచ్ చిరంజీవి గారు. ఊహించని అనుభూతికి నేను లోనయ్యాను. లవ్ యూ సర్" అంటూ ట్వీట్ చేసింది.
raai laxmi
Chiranjeevi
julie 2
bollywood
Tollywood

More Telugu News